'సలార్' మూవీ లాంచ్.. ప్రత్యేక అతిథిగా యశ్

'సలార్' మూవీ లాంచ్.. ప్రత్యేక అతిథిగా యశ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న 'సలార్' చిత్రాన్ని హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో క‌న్నడ రాకింగ్ స్టార్ య‌శ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ప్రస్తుతం సలార్ లాంచింగ్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే ప్రభాస్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే కథానాయిక పేరును అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది.