ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ 2022 లో అంట!

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ 2022 లో అంట!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమాను ప్రభాస్ అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని తేలియాజేశారు నాగ్ అశ్విన్. అయితే ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని, 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని నాగ్ అశ్విన్ ఇంతకముందే తెలియజేసారు. 

అయితే ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా పై స్పందించాడు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వలన ఈ సినిమాను అనుకున్న సమయం లో విడుదల చేయలేకపోతున్నాము అని తెలియజేసాడు. అయితే  2021 చివర్లో కాకుండా 2022 ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తాం అని తెలిపాడు. ఇక ఈ విషయం ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశపరుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డింది.