హీరోల మధ్య ఆగష్టు వార్

హీరోల మధ్య ఆగష్టు వార్

టాలీవుడ్ సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. ఎన్ని హిట్ అవుతున్నాయి అన్నది ముఖ్యం.  పది పదిహేను సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.  సినిమా నిర్మాణం వేగంగా జరుగుతుండటంతో రిలీజ్ డేట్స్ ఇబ్బందిగా మారుతున్నాయి.  ఒక్కోసారి పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కావాల్సిన పరిస్థితి వస్తోంది.  మామూలు సినిమాలు ఒకేరోజు మూడు నాలుగు రిలీజైన పెద్దగా ఇబ్బంది ఉండదుగాని, ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాల విషయంలోనే ఇలా జరిగితే ఇబ్బంది.  

వచ్చే ఆగస్టు కోసం ముగ్గురు హీరోలు పోటీ పడుతున్నారు.  ప్రభాస్ సాహో రిలీజ్ డేట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నాడు.  ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  మరోవైపు నాని, విక్రమ్ కుమార్ ల గ్యాంగ్ లీడర్ సినిమాను కూడా ఆగస్టులోనే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సినిమా ఆగష్టు 15 తరువాత వారంలో రిలీజ్ కావొచ్చు.  ఈ ఇద్దరు హీరోలతో పాటు శర్వానంద్.. సమంత జంటగా నటిస్తున్న తమిళ రీమేక్ సినిమా కూడా ఆగస్టులో రిలీజ్ కానుంది.  ఉగాదికి సినిమా ప్రారంభించి ఆగష్టులో రిలీజ్ చేయాలని దిల్ రాజు లక్ష్యంగా పెట్టుకున్నాడు.  నాని, శర్వానంద్ లు మంచి స్నేహితులనే విషయం అందరికి తెలుసు.  ఇద్దరి సినిమాలు క్లాష్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు.  ఈసారి పోటీ తప్పేలా లేదు.  చూద్దాం.