జాన్ లో ప్రభాస్ ఇలానే ఉంటాడా? 

జాన్ లో ప్రభాస్ ఇలానే ఉంటాడా? 

ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న సినిమా జాన్.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.  సాహో సినిమా పెద్దగా హిట్ కాలేకపోయినా, బాహుబలి మానియాతో బాలీవుడ్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది.  అయితే, ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.  1920 కాలానికి ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ సినిమా తీస్తున్నారు.  

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, దీని కోసం అనేక సెట్స్ ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు.  కాగా షూటింగ్ కొంతభాగం గతంలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.  సంక్రాంతి పండగ సమయంలో ప్రభాస్ కు సంబంధించి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటె ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫ్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ ఫోటోలో ఉన్నట్టుగానే ప్రభాస్ ఉంటారని అంటున్నారు.  జాన్ సినిమాలో ప్రభాస్ లుక్ ఇదే అని అంటుండటంతో సోషల్ మీడియాలో ఫోటో ట్రెండ్ అవుతున్నది.