ప్రభాస్ కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది !

ప్రభాస్ కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది !

రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' లాంటి భారీ హిట్ తర్వాత కూడ వేగం పెంచకుండా నెమ్మదిగానే సినిమాలు చేస్తున్నారు.   ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న 'సాహో' ఒక కొలిక్కి రావడంతో ప్రభాస్ కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.  ఈ నెల 6వ తేదీన ఈ సినిమా లాంచ్ కానుంది. 

ఈ సినిమాను 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.  ఇది పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం.  ఇక ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.