ఇటలీలో మొదలైన ప్రభాస్ కొత్త సినిమా !
రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. 'జిల్ ఫేమ్' రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను గోపికృష్ణ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా పనులు ఇటీవలే ఇటలీలో మొదలయ్యాయి.
ప్రభాస్, ఇతర కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఇకపోతే సుజీత్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'సాహో' సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)