‘మాస్టర్‌’ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ!

‘మాస్టర్‌’ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.  రీసెంట్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తోనూ ఓ మూవీ చేయనున్నాడు రెబల్‌ స్టార్‌. ఈ మూడు  సినిమాల తర్వాత ప్రభాస్‌.. మాస్టర్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్ తో ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఇప్పటికే స్టోరీ రెడీ అయినట్లు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ కమల్‌ హాసన్‌తో విక్రమ్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. కాగా... ఇటీవలే డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కరోనా బారీన పడిన విషయం తెలిసిందే.