ప్రభాస్ మళ్ళీ బిజీ.. !! 

ప్రభాస్ మళ్ళీ బిజీ.. !! 

బాహుబలి కోసం ఐదేళ్లు, సాహో కోసం రెండేళ్లు కేటాయించిన ప్రభాస్ ఇప్పుడు కొత్త సినిమా జాన్ సినిమా బిజీలో పడిపోయాడు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  సెకండ్ షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతున్నది.  1970 కాలానికి సంబంధించిన లవ్ స్టోరీతో సినిమా తెరకెక్కుతోంది.  యూరప్ దేశానికీ చెందిన సెట్స్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన సంగతి తెలిసిందే.  

యువీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  రాధాకృష్ణ దర్శకుడు.  పూజా హెగ్డే హీరోయిన్.  ఈ మూవీని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.  సాహో సినిమా పరాజయం పాలవ్వడంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ప్రభాస్ చూస్తున్నారు.  ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో సినిమాపై నమ్మకం ఉందని అంటున్నది యూనిట్.