ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్ చేయనున్న ప్రభాస్ !

ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్ చేయనున్న ప్రభాస్ !

వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యే ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేశాడు. కాగా, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ప్రభాస్ తన అభిమానులకు ప్రేమికుల రోజున గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట.. రాధే శ్యామ్ సినిమా టీజర్ ని వచ్చే నెల 14న విడుదల చేయనున్నారట. రాధాకష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ‘సాలార్’ ని మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.