రాధేశ్యామ్ రిలీజ్ అప్పుడేనట..?

రాధేశ్యామ్ రిలీజ్ అప్పుడేనట..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి టీజర్ వంటి ఉర్రూతలూగించే అప్‌డేట్ రాలేదు. అంతేకాకుండా నూతన సంవత్సర సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతందన్న మేకర్స్ ఒక్క ఫొటోతో సరిపెట్టారు. దాంతో పాటు సంక్రాంతి నాడు కూడా అభిమానలకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వక పోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రాధేశ్యామ్ టీం సరికొత్త వార్తను ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి రాధేశ్యామ్ సినిమా వీఎఫ్ఎక్స్ పనిని పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ భావించడం లేదా. అందుకనే కాస్త ఆలస్యం అయినా సరే ఈ సినిమాను జులై 12న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో నూతనోత్సాహం ఉరకలు వేస్తుంది. సినిమా జులైలో విడుదలయితే అతి త్వరలో టీజర్ వచ్చేస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. మరి అభిమానులు ఎదురుచూస్తున్న టీజర్‌ను రాధేశ్యామ్ టీం ఎప్పుడు విడుదల చేస్తుందనేది చూడాలి.