రూ.400 కోట్ల క్లబ్ లో సాహో.. !!

రూ.400 కోట్ల క్లబ్ లో సాహో.. !!

ప్రభాస్ సాహో రిలీజైన మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది.  డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న వసూళ్ల విషయంలో మాత్రం దూకుడును ప్రదర్శిస్తూనే ఉన్నది. మొదటి నాలుగు రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన సాహో, ఆ తరువాత క్రమంగా వసూళ్లు డ్రాప్ అవుతూ వచ్చాయి.  

కాగా, ఈ మూవీ రూ. 400 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.  ఈ విషయాన్ని సాహో యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లాంగ్ రన్ లో మరో రూ.50 నుంచి రూ. 60 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.  బాలీవుడ్లో కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం.  అక్కడ టాక్ తో సంబంధం లేకుండా యాక్షన్ ను ఇష్టపడి సినిమా చూస్తున్నారు.  బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి టాక్ రావడం విశేషం.