ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!!

ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!!

ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ సినిమా రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే సిద్ధం చేసింది.  

ఇదిలా ఉంటె, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు.  సాహో సినిమాకు సంబంధించి వీడియో గేమ్ ను తయారు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా, దీనికి సంబంధించి ఈరోజు సాహు వీడియో గేమ్ టీజర్ ను ప్రభాస్ లాంచ్ చేశారు.  ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ పేజీలో ఈ ట్రైలర్ ను పోస్ట్ చేశారు.  యాక్షన్ జానర్లో రూపొందించిన ఈ టీజర్లో ప్రభాస్ లీడ్ రోల్లో కనిపిస్తారు.  ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే భారీ రెస్పాన్స్ వచ్చింది.  ఆగస్టు 15 వ తేదీన ఈ గేమ్ రిలీజ్ కాబోతున్నది.