నెల రోజులే గడువుంది... మిత్రమా..!!
ప్రభాస్ సాహో రిలీజ్ సమయం దగ్గర పడుతున్నది. ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. మరో నెల రోజుల్లో థియేటర్లో సినిమా సందడి చేయబోతున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇంకా ట్రైలర్ షురూ కాలేదు. ఆడియో డేట్ ఫిక్స్ చేయలేదు.
ప్రమోషన్స్ లో జోష్ లేదు. ఎక్కడి పనులే అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు సినిమాను న్యూస్ లో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే సినిమాకు హైప్ వస్తుంది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి మామూలుగానే హైప్ ఉంటుంది. దీనిని మరింత క్యాష్ చేసుకోవాలి అంటే నిత్యం ఏదో ఒక అప్డేట్ తో ఉండాలి. సాహో పనులు నెమ్మదిగా సాగుతుండటం ఇబ్బంది పెడుతున్నది. అందుకే ప్రభాస్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ట్రైలర్ కట్ చేసి ఫైనల్ టచ్ ఇస్తున్నారని వినికిడి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)