ప్రభాస్ సాహో రన్ టైమ్ లాక్..అన్ని గంటలా..?

ప్రభాస్ సాహో రన్ టైమ్ లాక్..అన్ని గంటలా..?

సాహో మూవీ ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యింది.  దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  పక్కా యాక్షన్ పార్ట్ తో ట్రైలర్ కట్ చేశారు.  సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ పార్ట్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి రన్ టైమ్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది.  

ఫస్ట్ హాఫ్ 1గంట 24 నిమిషాలు కాగా, సెకండ్ హాఫ్ 1గంట 28 నిముషాలు ఉన్నట్టు తెలుస్తోంది.  మొత్తంగా చూసుకుంటే 8 నిముషాలు తక్కువగా మూడు గంటలు.  బాబోయ్ ఇంత సమయమా అని షాక్ అవుతున్నారా.. మాములు సినిమాలైతే బోర్ కొడతాయి అనుకోవచ్చు.  ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాబట్టి లెంగ్త్ ఎక్కువైనా పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు యూనిట్.  ప్రభాస్ అండర్ కవర్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుంది.. ఏంటి అనే విషయాలు తెలియాలంటే.. ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే.