సాహో నష్టాల నుంచి బయటపడాలంటే..!! 

సాహో నష్టాల నుంచి బయటపడాలంటే..!! 

ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  నష్టాల నుంచి సినిమా బయటపడాలి అంటే ఇంకా దాదాపు రూ. 40 కోట్ల రూపాయలు వసూలు చేయాలి.  

ఇది సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు.  ఒక్క బాలీవుడ్లో తప్పించి సినిమా మరెక్కడా వందకోట్ల రూపాయలు వసూళ్లు సాధించలేదు.  అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో సాహో ఐదో స్థానంలో నిలిచింది. సాహో లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు నుంచి పది కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నది.  ఎలా చూసుకున్నా సాహో కు కనీసం ముప్పై కోట్ల రూపాయల మేర నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది.