ప్ర‌భాస్ కొత్త కారులో సోద‌రి షికారు

ప్ర‌భాస్ కొత్త కారులో సోద‌రి షికారు

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ తో ‘రాధే శ్యామ్’.. ప్రశాంత్ నీల్ తో ‘సలార్’.. ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’.. నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తూ రెండేళ్ల వరకు ఖాళీ లేకుండా బిజీగా ఉండనున్నారు. ఇదిలావుంటే, ఇటీవ‌లే ప్ర‌భాస్ అత్యంత ఖ‌రీదైన కారు లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్ ను కొనుగోలు చేశాడు. నారింజ రంగులో మెరిసే ఈ కారులో ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లాదేవితో పాటు ప్రభాస్‌ సోదరి ప్రసీద (కృష్ణంరాజు-శ్యామల కుమార్తె) ఈ కారులో షికార్లు కొట్టింది.. ఈ మేరకు వీడియోను ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లాదేవి పోస్ట్ చేశారు. హైద‌రాబాద్ రోడ్ల‌పై ఈ ఇద్ద‌రూ షికారు చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.