నిక్కర్లేసుకునే వయసులోనే సినిమా....అయినా పల్స్ తెలుసన్న ప్రభాస్ !

నిక్కర్లేసుకునే వయసులోనే సినిమా....అయినా పల్స్ తెలుసన్న ప్రభాస్ !

సాహో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో అందరికంటే చివరిలో మాట్లాడిన ప్రభాస్  ఈ సినిమా దర్శకుడిని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌. అని అతనికి మాస్‌ పల్స్‌ ఏంటో బాగా తెలుసని అన్నారు. ఈ సినిమాకు పెద్ద పెద్ద టెక్నిషీయన్లు పనిచేశారని, మధి, సబు సిరిల్‌, శ్రీకర్‌‌, కమల్‌ కన్నన్ ల పేర్లు చెప్పి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కధ చెప్పడానికి సుజీత్‌ నిక్కరేసుకొని వచ్చాడని, అప్పుడు అతనికి 24 ఏళ్లని చెప్పుకొచ్చారు.

అప్పటికే మా ప్రొడక్షన్‌లో ‘రన్‌ రాజా రన్‌’ చేశాడని, సాహో కధ ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా కథ చెప్పాడని అన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్‌ కి వెళ్ళే ముందు చాలా వర్క్‌ చేశాడని అన్నారు. ఆయా సన్నివేశాలు ఎలా తీయాలో వాళ్లతో ముందే ప్లాన్‌ చేశాడు. చాలా పెద్ద పెద్ద టెక్నిషియన్లను తీసుకున్నాడని, వారిని ఎలా హ్యాండిల్ చేస్తాడోనని భయపడ్డానని కానే వారిని హ్యాండిల్ చేసిన తీరు ముచ్చటేసిందని అన్నారు. శ్రద్ధాకపూర్‌ ఈ సినిమకి దొరకడం మా అదృష్టం అని ప్రభాస్ పేర్కొన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ లు తన ప్రాణ స్నేహితులు అని పేర్కొన్న ప్రభాస్ వారిలాంటి స్నేహితులు అందరికీ ఉండాలని అన్నారు. సరిగ్గా తీస్తే 100కోట్ల తక్కువకే అయ్యేదని కానీ అలాంటివి ఏమీ చూడకుండా సినిమా మీద ప్రాణం పెట్టి తీశారని అన్నారు.