వీడియో కాల్స్ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న డార్లింగ్...

వీడియో కాల్స్ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న డార్లింగ్...

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణతో పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. దీంతో దాదాపుగా ప్రజా జీవనం స్థంబించిపోయింది. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కరోనాను అదుపులోకి తీసుకు రావాలంటే కఠిన చర్యలు తప్పవనే సంగతి అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండబోతోందని ఇప్పటికే సూచనలు అందుతున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. థియేటర్లు రీఓపెన్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందనేఅనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక లాక్ డౌన్  నేపథ్యంలో సెలెబ్రిటీ, కామన్ మ్యాన్ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్లు మరి ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.ఈ లాక్ డౌన్ సమయాన్ని డార్లింగ్ ప్రభాస్ పూర్తిగా వినియోగించు కుంటున్నాడట. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అని అడిగితే.. నా లాక్ డౌన్ సమయం అంతా నిద్ర పోవడానికి కేటాయిస్తున్నా అని చెప్పుకొచ్చాడట. అంతేగాక తన బెస్ట్ ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడట. అనుష్క - రాజమౌళి - రానా ఇలా తనకు సన్నిహితమైన వారితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడట.