విలన్ పాత్రలో ప్రభాస్...? 

విలన్ పాత్రలో ప్రభాస్...? 

ప్రభాస్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ టాప్ హీరో.  బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  దేశం మొత్తం అయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నది.  బాహుబలి తరువాత చేసిన సాహో సినిమా ఫెయిల్ అయినా.. బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టింది.  ఏకంగా రూ. 300 కోట్లకు పైగా అక్కడ వసూళ్లు సాధించింది.  ప్రభాస్ యాక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

ఈ సినిమా సినిమా తరువాత ఇప్పుడు జాన్ సినిమా చేస్తున్నారు.  ఇది కూడా ఫ్యాన్ ఇండియా మూవీనే. బాహుబలి, సాహో సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రభాస్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ బంపర్ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.  బాలీవుడ్ స్టార్ నిర్మాత ఆదిత్య చోప్రా ధూమ్ సీరీస్ లోని నాలుగో భాగంలో ప్రభాస్ ను విలన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది.  దీనికోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నది.  ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ లు విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు.  సినిమా మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది.  త్వరలోనే ధూమ్ 4 సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.  మరి ధూమ్ 4 లో నటించేందుకు ప్రభాస్ ఒప్పుకుంటారా? చూద్దాం.