ఆర్ఆర్ఆర్ లో మరో స్టార్ హీరో..!!

ఆర్ఆర్ఆర్ లో మరో స్టార్ హీరో..!!

ఆర్ఆర్ఆర్ సినిమా దేశంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది.  దాదాపు రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.  ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.  తమిళ దర్శకుడు సముద్ర ఖని ఓ ప్రముఖ పాత్రను చేస్తున్నారు.  అంతకు మించి మరే సమాచారం బయటకు రావడం లేదు.  ఇందులో హీరోయిన్లు ఎవరు అన్నది ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో పుకారు బయటకు వచ్చింది.  ఈ సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గెస్ట్ క్యారెక్టర్ చేసే హీరో ఎవరో కాదు ప్రభాస్ అని చెప్తున్నారు.  ప్రభాస్ ఆర్ఆర్ఆర్ లో గెస్ట్ క్యారెక్టర్ చేస్తే.. ఆ సినిమాకు మరింత మైలేజ్ వస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలి.