ప్రభాస్ ఫ్యాన్స్ కి రేపు పండగే !

ప్రభాస్ ఫ్యాన్స్ కి రేపు పండగే !

సాహో తరువాత రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలికే ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోవడంతో ఈసారి ప్యాన్ వరల్డ్ స్టార్ ని చేస్తానని మాటిచ్చి నాగ్ అశ్విన్ ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఇక ఇవి కాక అభిమానులకు ప్రభాస్ మరో సంచలన బహుమతి ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఆ గిప్ట్ ఇవ్వనున్నాడు. ఆ విషయానికి హింట్ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసాడు ఈ హీరో. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఈ మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తాడని కొందరు అంటుంటే, లేదు శివాజీ జీవిత చరిత్ర మీద సినిమా, ఇందులో శివాజీగా ప్రభాస్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ చేయబోయేది శివాజీ పాత్రనా లేక రాముడి పాత్రనా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.