సలార్ సినిమాకు కొత్త టెన్షన్.. వారి కోసమే..

సలార్ సినిమాకు కొత్త టెన్షన్.. వారి కోసమే..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్, నాగశ్విన్ ప్రాజెక్ట్‌ ఒకే చేశాడు. వీటిలో రాధేశ్యామ్ చిత్రీకరణలో ఉండగానే బాలీవుడ్ దర్వకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమాకు ఓకే చెప్పాడు. దాని తర్వాతా దేశంలో సంచలనాలు సృష్టించిన కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యాక్షన్ సినిమా సలార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా చేశారు. ఇందులో కేజీఎఫ్ హీరో యశ్ కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే దసరాకు రిలీజ్ చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమీ టీంలో టెన్షన్ టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పటివరకు హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. ఆ విషయంలో దర్శకుడు కూడా ఓ క్లారిటీకి రాలేదు. ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ కావడంతో ఇందులో స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. కానీ బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌లు ఎవరూ ఫ్రీగా లేరే. అందరూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ప్రశాంత్ ఇద్దరిని కలిసి డేట్స్ కోసం చర్చించగా తాము బిజీగా ఉన్నామని డేట్స్ ఖాళీ లేవని చెప్పి తిరస్కరించారట. అయితే నాగశ్విన్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా చేయనున్న దీపికా పదుకొణేను ప్రశాంత్ కలిసాడట. కానీ దీపిక ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. దాంతో డేట్స్ ఇవ్వడం కుదరదని చెప్పింది. దాంతో సలార్ సినిమాకి ఇంకా హీరోయిన్‌ ఫిక్స్ అవ్వలేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.