పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్, విక్రమ్ !

పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్, విక్రమ్ !

దక్షిణాది సినీ హీరోలు కేరళ వరద బాధితుల సహాయం కోసం సిఎం రిలీఫ్ ఫండ్ కు ఎవరికి వారు తమ సహాయాన్ని ప్రకటిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.  ఇప్పటికే స్టార్ హీరోల దగ్గర్నుండి చిన్న హీరోలు, దర్శకులు, నటీమణులు అందరూ తమ వంతు సహాయాన్ని అందివ్వగా ఇప్పుడు ఇద్దరు బడా హీరోలు ప్రభాస్, విక్రమ్ లు కూడ మేము సైతం అంటూ ముందుకొచ్చారు. 

ముందుగా ప్రభాస్ 25 లక్షల రూపాయల్ని సిఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని ప్రకటించగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ 35 లక్షల్ని అనౌన్స్ చేసి చెక్ కూడ అందజేశారు.  ఈరోజు, రేపట్లో ఇంకొంతమంది సినీ ప్రముఖులు తమ సహాయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.