రెండు దయ్యలా కథ వర్కౌట్ అవుతుందా?

రెండు దయ్యలా కథ వర్కౌట్ అవుతుందా?

ప్రభుదేవా తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2 సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  అభినేత్రిలో తమన్నాను దెయ్యం ఆవహిస్తే... అభినేత్రి 2 లో ప్రభుదేవాను దెయ్యం ఆవహిస్తుంది.  ఆ దెయ్యం ఏంటి ఎందుకు అలా ఆవహించింది అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  

ఒకటి కాదు రెండు దెయ్యాలు అనే డైలాగులు రెండు మూడు చోట్ల టీజర్ లో వినిపించాయి.  ఆ రెండు దెయ్యాలు ఏంటి.. ఎందుకు ఆవహిస్తున్నాయి అన్నది కథ.  రెగ్యులర్ ఫార్మాట్ లో టీజర్ ఉంది.  ప్రభుదేవా డ్యాన్స్ తో అలరించాడు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మే 1 వరకు ఆగాల్సిందే.