ప్రభుదేవా పాటకు మహేష్ హీరోయిన్ స్టెప్పులు

ప్రభుదేవా పాటకు మహేష్ హీరోయిన్ స్టెప్పులు

1990లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ప్రభుదేవా ప్రేమికుడు సినిమా ఒకటి.  ఈ సినిమా అప్పట్లో మంచి హిట్.  యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.  కాగా ఈ సినిమాలో ఊర్వశి ఊర్వశి అనే సాంగ్ ఉన్నది.  ఆ సాంగ్ లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ ఇప్పటికి ఆకట్టుకున్నాయి.  ఆ సాంగ్ లోని స్టెప్పులను అనేకమంది నేర్చుకొని వందలాది మంది స్టేజ్ పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, ఊర్వశి సాంగ్ ను హిందీ అర్జున్ రెడ్డి సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు.  యోయో హనీసింగ్ ఈ సాంగ్ ను రీమిక్స్ చేసే పనిలో ఉన్నారు.  కాగా, అర్జున్ రెడ్డి హీరో షాహిద్ కపూర్ తో పాటు భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీపై ఈ సాంగ్ ను చిత్రీకరించబోతున్నారు.  ప్రభుదేవా ఆల్ టైం హిట్ సాంగ్స్ లో ఊర్వశి కూడా ఒకటి.  ఈ సాంగ్ లో మరి ఈ జంట ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడాలి.