పద్మ ప్రదానోత్సవంలో ప్రభుదేవా స్పెషల్ ఎట్రాక్షన్

పద్మ ప్రదానోత్సవంలో ప్రభుదేవా స్పెషల్ ఎట్రాక్షన్

డ్యాన్సర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రభుదేవా అంచలంచెలుగా ఎదుగుతూ.. నటుడుగా, దర్శకుడిగా మారారు. దర్శకుడిగా మారిన తరువాత సౌత్ తో పాటు బాలీవుడ్ లోను అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు.  బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిలో ఒకరిగా ప్రభుదేవా గుర్తింపు పొందాడు.  సినీ రంగానికి ప్రభుదేవా చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది. 

ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలో ప్రారంభమైంది.  రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రధానోత్సవం చేస్తున్నారు.  ఈ కార్యక్రమానికి ప్రభుదేవా తమిళ స్టైల్ లో పంచె కట్టుకొని వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.  మలయాళం స్టార్ మోహన్ లాల్, శివమణి, శంకర్ మహదేవన్, టాలీవుడ్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు.