క్షమాపణలు తెలిపిన సాధ్వి ప్రజ్ఞా సింగ్

క్షమాపణలు తెలిపిన సాధ్వి ప్రజ్ఞా సింగ్

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ను దేశభక్తుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, భోపాల్ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ క్షమాపణ తెలిపారు. గాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతావనిలో తొలి హిందూ టెర్రరిస్టు అని నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సాధ్వి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడ్సేను దేశభక్తుడన్న సాధ్వి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. సొంతపార్టీ నుంచి కూడా ఆమెకు మద్దతు లభించలేదు. సాధ్వి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించడంతో ఆమె దిగిరాక తప్పలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ఆమె క్షమాపణలు తెలిపారు.