పాదయాత్రకు నేడు బ్రేక్...

పాదయాత్రకు నేడు బ్రేక్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 267వ రోజు(గురువారం) రద్దయింది. ప్రస్తుతం విశాఖలో కురుస్తున్న వర్షం కారణంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు ఉదయం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని కొలవాని‌పాలెం క్రాస్ మీదుగా పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు పాదయాత్ర చేసి.. రేపు కోర్టులో హాజరుకావాల్సి ఉన్నందున హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు వైఎస్ జగన్. అయితే పాదయాత్రకు నేడు బ్రేక్ ఇవ్వడంతో జగన్ ముందుగానే హైదరాబాద్‌కు బయల్దేరే అవకాశం ఉంది.