రేపటి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

రేపటి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ఆదివారం భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు ఈదుల బయ్యారం నుంచి యాత్రను కొనసాగించనున్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించనున్నారు.