మా రాజీనామాలను ఆమోదించమని కోరతాం 

మా రాజీనామాలను ఆమోదించమని కోరతాం 

మా రాజీనామాలను వెంటనే ఆమోదించమని పార్లమెంట్ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి కోరతామన్నారు వైకాపా నేత, ప్రకాశం జిల్లా ఎంపీ వై. వి సుబ్బారెడ్డి. ఈరోజు ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తాము ఏలాంటి భావావేశాలకు, వత్తిడిలకు లోనై రాజీనామాలు చేయలేదని.. తక్షణం మా రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ ను కలిసి కోరతామని స్పష్టం చేశారు.  కర్నాటకకు చెందిన బిజేపి ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించారు కానీ.. మా రాజీనామాలను ఆమోదించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని స్పీకరును గట్టిగా అడుగుతామని ఆయన వెల్లడించారు.  

ప్రత్గేక హోదాపై మా పార్టీ నేతలు చేస్తోన్న పోరాటాన్ని మా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల ప్రజలు సమర్ధిస్తున్నారని..  స్వాగతించి మా నేతలను మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజలు మరలా మమ్ములను పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాబోవు ఉప ఎన్నికలలో మా గెలుపే రానున్న సార్వత్రిక ఎన్నికలలో మా పార్టీ అఖండ విజయానికి నాంది కానుందని ఆయన అన్నారు. 'ప్రత్యేక హోదా' కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నది తమ పార్టీయోనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని కూడా వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.