నాగబాబుకు రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన ప్రకాశ్‌ రాజ్‌

నాగబాబుకు రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన ప్రకాశ్‌ రాజ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సినీ ఇండస్ట్రీని తాకాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొదట జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమై... తర్వాత బీజేపీకి మద్దతు పలికారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు పెరిగాయి. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ కూడా స్పందించారు. దీంతో మెగా బ్రదర్‌ నాగబాబు, నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది ఈ వివాదం. పవన్‌ కళ్యాణ్‌ ఓ ఊసరవెల్లి అని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించగా.. దానికి నాగబాబు కౌంటర్‌ ఇచ్చారు. "పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతీ పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. నువ్వు ఎంతమంది నిర్మాతల్ని డబ్బకొసం హింసించింది. ఇచ్చిన డేట్స్‌ని కాన్సల్ చేసింది అన్నీ తెలుసు. ముందు నువ్వు మారు." అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. అయితే.. తాజాగా నాగాబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్‌ రాజ్‌ కూడా రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. "గౌరవనీయులైన నాగబాబుగారికి,  మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు. "#justasking అంటూ కౌంటర్‌ ట్వీట్‌ చేశారు ప్రకాశ్‌ రాజు.