విష‌మంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య ప‌రిస్థితి ?

 విష‌మంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య ప‌రిస్థితి ?

ప్ర‌ముఖుల‌ను సైతం వ‌ద‌ల‌డంలేదు క‌రోనా వైర‌స్.. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌, పార్ల‌మెంట్‌.. ఇలా చాలావ‌ర‌కు ఢిల్లీలోని ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను ట‌చ్ చేసింది. తాజాగా, మాజీ రాష్ట్రప‌తి ప్రణబ్ ముఖర్జీ క‌రోనా బారిన‌ ప‌డ్డారన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం నిర్వ‌హించిన క‌రోనా టెస్ట్‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఆయనను వెంటిలేటర్ మీద పెట్టి నట్టు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం మిలిటరీ రీసెర్చ్ అండ్ రిఫరల్ లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఉదయం ఆయన ఒక ట్వీట్ చేశారు.  ఇవాళ నాకు కరోనావైర‌స్ పాజిటివ్‌గా తేలింది... చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నాన‌ని ట్వీట్ చేసిన ఆయ‌న‌.. గత వారంలో న‌న్ను సంప్రదించినవారు ద‌య‌చేసి  ఐసోలేష‌న్ లో ఉండాల‌ని మ‌రియు క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అభ్య‌ర్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.