లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రణీత

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రణీత

అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ అయినప్పటికీ... బాపు బొమ్మలా ఉండే ప్రణీతకు కూడా మంచి మార్కులు పడ్డాయి.  పవన్ కళ్యాణ్ మొదట ఆ అమ్మాయినే ప్రేమిస్తాడు.  ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సాంగ్ కూడా అదిరిపోతోంది.  ఈ సినిమా తరువాత ప్రణీత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కలిసిరాలేదు.  అప్పుడప్పుడు టాలీవుడ్ ను పలకరిస్తోంది.  

అటు కన్నడంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ప్రణీత... ఎన్నికల సమయంలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.  రాష్ట్రంలో ఎన్నికలపై అవగాహనా కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ప్రణీతను రాష్ట్ర ఐకాన్ గా నియమించింది. దానికి సంబంధించిన పత్రాన్ని ఎన్నికల కమిషన్ ప్రణీతకు అందజేసింది.  ఈ పత్రాన్ని ప్రణీత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి... తనను ఎంపిక చేసినందుకు ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపింది.