జగన్ నివాసంలో ప్రశాంత్ కిషోర్

జగన్ నివాసంలో ప్రశాంత్ కిషోర్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి వైకాపాపై ఉండటం విశేషం.  ఎన్నికల కౌంటింగ్ సరళిని వైకాపా నాయకులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.  వైకాపా నేతలు అమరావతిలోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు.  కాగా, వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ నివాసంలో జగన్ తో కలిసి ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు.  ఈ ఎన్నికలు కౌంటింగ్ రసవత్తరంగా సాగబోతున్నది.  ఎవరు ఎవరికీ మెజారిటీ వస్తుంది.. ఎవరు గెలుస్తుంది అనే విషయాలు మధ్యాహ్నం 2 గంటల తరువాత వచ్చే అవకాశం ఉన్నది.