క్వీన్ రీమేక్ .. దర్శకుడు చేంజ్..

క్వీన్ రీమేక్ .. దర్శకుడు చేంజ్..

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ మూవీ క్వీన్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఆ సినిమాతో కంగనా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  ఫ్యాషన్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా.. అందరిని ఆకట్టుకుంది.  ఈ సినిమా తరువాత కంగనా లేడీ ఒరింటెండ్ సినిమాలు వరసగా వస్తున్నాయి.  ప్రస్తుతం కంగనా మణికర్ణికా అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తోంది.  

ఇక ఇదిలా ఉంటె, కంగనా నటించిన క్వీన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.  మను కుమరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మొదట ఈ సినిమా దర్శకుడిగా నీలకంఠను అనుకున్నారు.  డ్రామాను అద్భుతంగా నడిపించగల సత్తా ఉన్న దర్శకుడు నీలకంఠ.  అయితే, గత కొంతకాలంగా నీలకంఠకు మంచి హిట్ లేదు.  దీంతో ఈ దర్శకుడిని క్వీన్ నుంచి తప్పించారు.  ఈ బాధ్యతలను 'అ' సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మకు ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.  సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో అ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారని..అందుకే క్వీన్ బాధ్యతను ఆయనకు అప్పగిస్తున్నట్టు నిర్మాత చెప్తున్నారు.  బాలీవుడ్ లో క్వీన్ గా కంగనా నటిస్తే.. రీమేక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.