ఏపీకి బెస్ట్ సీఎంగా ఉండాలి..!

ఏపీకి బెస్ట్ సీఎంగా ఉండాలి..!

వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ఐప్యాక్ బృందాన్ని జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్ జగన్.. అక్కడ ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్నికలకోసం పనిచేసిన అందరికీ కృతజజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ రాగానే మన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారు అంటూ జగన్‌ను తన స్టాఫ్‌కి పరిచయం చేశారు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పాలన అందించడానికి వైఎస్ జగన్ సీఎం అవుతున్నారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగన్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రశాంత్ కిషోర్... ఏపీకి బెస్ట్ చీఫ్‌ మినిష్టర్‌గా ఉండాలంటూ ఆకాంక్షించారు. కాగా, ఈ ఎన్నికలకు వైసీపీకి కీలంగా పనిచేసింది ప్రశాంత్ కిషోర్ టీమ్.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, వైసీపీలో అంతర్గత సర్వేలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని అంశాల్లోనూ సహకారం అందించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో వైసీపీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు.