పీకే ఆసక్తికర వ్యాఖ్యలు.. నా వృత్తిని పూర్తిగా వదిలేస్తా..!

పీకే ఆసక్తికర వ్యాఖ్యలు.. నా వృత్తిని పూర్తిగా వదిలేస్తా..!

ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగాడంటే.. వార్ వన్‌ సైడే అని చెబుతుంటారు.. ఎందుకంటే.. ఆయన సాధించినపెట్టిన విజయాలు అలాంటివి.. కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులతో ఆయన ప్రణాళికలు బెడిసికొట్టిన సందర్భాలు కూడా కొన్నిలేకపోలేదు.. అయితే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీని మరోసారి సీఎం చైర్‌లో కూర్చోబెట్టే బాధ్యత నెత్తికేసుకున్నారు పీకే.. బెంగాల్‌లో ఒకవేళ బీజేపీ గనక అధికారంలోకి వస్తే.. తాను ప్రస్తుతం చేస్తున్న వృత్తి నుంచి పూర్తిగా తప్పుకుంటానని.. దీనికి పూర్తిగా భిన్నమైన వృత్తిలోకి వెళ్లిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. అంతే కాదు.. బెంగాల్‌లో వంద సీట్ల కంటే బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా.. నా సంస్థను కూడా మూసేస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతున్న అంశాలను కూడా ప్రస్తావించారు పీకే.. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు పుష్కలంగా ఉన్నాయన్న ఆయన.. ఆ లొసుగులను బీజేపీ వాడుకుంటోందని చెప్పుకొచ్చారు.. రాజకీయ వలసలపై స్పందిస్తూ.. బీజేపీ వ్యూహంలో భాగంగానే తృణమూల్ నుంచి బీజేపీకిలో వలసలు సాగుతున్నాయని.. అనేక కారణాలతో నేతలను బీజేపీవాల్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, బెంగాల్‌లో తృణమూల్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమన్న ధ్యేయంతోనే తాను పనిచేస్తున్నానన్నారు.. ఇక, తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని సంతృప్తి వ్యక్తం చేసిన పీకే.. తృణమూల్ తనంతట తాను బలహీనపరుచుకుంటే తప్ప... బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు.