అమిత్‌ షాపై పీకే ఫైర్.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీయే కారణం..!

అమిత్‌ షాపై పీకే ఫైర్.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీయే కారణం..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల వ్యూహకర్త, జేడీ(యూ) డిప్యూటీ చీఫ్ ప్రశాంత్ కిషోర్... లక్నోలో మంగళవారం సీఏఏకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. చట్టం ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, అది అమలు చేసి తీరుతాం.. నిరసన తెలియజేసేవారు కొనసాగించవచ్చు అని వ్యాఖ్యానించడంపై అభ్యంతరం తెలిపారు పీకే. ఇవాళ లక్నోలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్... 'ప్రజల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వ బలానికి సంకేతం కాదు' అని వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరరేకంగా నిరసన తెలిపేవారిని మీరు పట్టించుకోకపోతే.. ముందుకు వెళ్లి సీఏఏ, ఎన్‌ఆర్సీని ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు పీకే. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతుండగా.. నిర్దేశించిన తేదీ తర్వాత భారతదేశానికి వచ్చిన నమోదుకాని వలసదారులను గుర్తించాలని ఎన్ఆర్సీ భావిస్తోంది. ఇక, భారతీయ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా సీఏఏ మొదటిసారిగా మతాన్ని పౌరసత్వం కోసం ఒక షరతుగా మారుస్తుందనే విమర్శలున్నాయి. ఎన్‌ఆర్‌సితో కలిపి, వారి వంశాన్ని నిరూపించలేని ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ముందుకు వెళ్తామని కేంద్రం భావిస్తోంది. కాగా, మొదట సీఏఏ, ఎన్‌ఆర్సీకి మద్దతు తెలిపిన జేడీ(యూ) అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఆ తర్వాత దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.