సింగరేణిలో ‘సలార్‌’ షూటింగ్‌

సింగరేణిలో ‘సలార్‌’ షూటింగ్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ జనవరి 29 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారట. ఈమేరకు సలార్ సినిమా సెట్స్ లో బిజీగా ఉందట చిత్రబృందం. ఈ సినిమా అనంతరం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే ఖరారు అయింది.