మహేష్ వద్దట.. ఎన్టీఆరే కావాలట

మహేష్ వద్దట.. ఎన్టీఆరే కావాలట

'కె.జి.ఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ త్వరలో తెలుగులో ఒక సినిమా చేయనున్నాడు.  'కె.జి.ఎఫ్ 2' పూర్తవగానే ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  మొదట్లో మైత్రీ నిర్మాతలు ఈ సినిమాలో మహేష్ బాబును తీసుకోవాలని అనుకున్నారు.  అదే విషయాన్ని ప్రశాంత్ నీల్ వద్ద చెప్పారు.  కానీ ప్రశాంత్ నీల్ మాత్రం మహేష్ కాదని ఎన్టీఆర్ కావాలని అన్నారట.  అందుకు కారణం ఎన్టీఆర్ అయితే సినిమాలో మాస్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుందని ఆయన భావించడమే.  ఇక మైత్రీ కూడా ఎన్టీఆర్ హీరోగా గతంలో 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ సినిమాను తీసి ఉండటం, ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉండటంతో ప్రశాంత్ నిర్ణయానికే ఓకే చెప్పారట.