2020 ఐపీఎల్ నుండి పెద్ద వయస్కుడు ఔట్...

2020 ఐపీఎల్ నుండి పెద్ద వయస్కుడు ఔట్...

2020 ఐపీఎల్ వేలంలో పాల్గొని ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు పాల్గొన అతి పెద్ద వయస్కుడిగా ప్రవీణ్ తాంబే(48) రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాంబే పైన బీసీసీఐ వేటు వేసింది. అతడు బీసీసీఐ నియమాలను ఉలంగించిన కారణంగా ఈ 2020 ఐపీఎల్ నుండి అతడిని తొలగించింది బీసీసీఐ. అసలు ఏం జరిగిందంటే... మన బీసీసీఐ నియమాల ప్రకారం ఐపీఎల్ ఆడే ఏ భారత క్రికెటర్ అయిన సరే వేరే దేశాల్లో జరిగే లీగ్ మ్యాచ్ లు ఆడకూడదు ఒక వేళా ఆడితే ఆ ఆటగాడు ఐపీఎల్ లో ఆడటానికి అనర్హుడు అవుతాడు. అయితే ప్రవీణ్ తాంబే గత సంవత్సరం జరిగిన దుబాయ్ టీ10 లీగ్ మ్యాచ్ లో ఆడటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కారణంగా అతడిని ఐపీఎల్ నుండి తొలగిస్తున్నటుగా ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించారు. అయితే 2020 ఐపీఎల్ లో అతడు వేలానికి వచ్చినప్పుడు... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.20లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి వయస్సు రికార్డు ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి మరి.