ఆ కాంట్రాక్ట్ సాధించిన మొదటి భారత క్రికెటర్ గా  ప్రవీణ్ తాంబే ... 

  ఆ కాంట్రాక్ట్ సాధించిన మొదటి భారత క్రికెటర్ గా  ప్రవీణ్ తాంబే ... 

48 ఏళ్ల ముంబై లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే కరేబియన్ ప్రీమియర్ లీగ్(సిపీఎల్) ప్లేయర్స్ డ్రాఫ్ట్ కోసం తన పేరును పంపించాడు, కానీ భారత దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించకపోతే బీసీసీఐ అతనికి సిపీఎల్ లో ఆడటానికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే... బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే ఇతర దేశాలలో జరిగే టీ  20 లీగ్‌లలో ఆడాలనుకునే ఏ ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది . కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్ళే ముందు యువరాజ్ సింగ్  కూడా అదే చేశాడు. అయితే అంతకముందు అబుదాబిలో జరిగిన టీ 10 లీగ్‌లో పాల్గొని బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో అతడిని అనుమతించలేదు బీసీసీఐ. అయితే ఇక  సిపీఎల్ లో తాంబే ను ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అంటే కీరన్ పొలార్డ్ నేతృత్వంలో ఉన్న జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. కోవిడ్-మహమ్మారి నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాత సిపీఎల్ 2020 ఆగస్టు 18 మరియు సెప్టెంబర్ 10 మధ్య మూసివేసిన తలుపుల వెనుక జరుగుతుంది. అయితే 48 ఏళ్ల ఈ భారత క్రికెటర్ మన దేశం నుండి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో  కాంట్రాక్ట్ సాధించి అందులో ఆడబోతున మొదటి ఆటగాడు అయ్యాడు. చూడాలి మరి ఈ విషయం పై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుంది అనేది.