తనిఖీలపై ఈసీ కీలక సూచనలు..

తనిఖీలపై ఈసీ కీలక సూచనలు..

ఎన్నికల సమయంలో వివిధ తనిఖీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది... ఎన్నికల నేపథ్యంలో ఐటీ, ఈడీ, ఈసీ తనిఖీ విభాగం నిర్వహిస్తోన్న సోదాలపై విమర్శలు పెరగడంతో.. సోదాల్లో ఎటువంటి పక్షపాత వైఖరి, వివక్షత ఉండొద్దని.. పూర్తి నిష్పక్షపాతంగా తనిఖీలు జరగాలని సూచించింది. ఎన్నికల సమయంలో జరుగుతున్న తనిఖీలపై పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టడం, పారదర్శకంగా, విశ్వసనీయతతో ఎన్నికలు నిర్వహించడానికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య మూలసూత్రాలకే విఘాతం కలుగుతోంది. ఎన్నికల వేళ అక్రమాలను అరికట్టడానికి జరుగుతున్న తనిఖీల్లో ఎలాంటి పక్షపాత వైఖరి, వివక్షత ఉండొద్దు. సోదాలు నిష్పక్షపాతంగా జరగాలని కోరుతున్నాం. అలాగే రెవెన్యూ, ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాలు నిర్వహిస్తున్న తనిఖీలు తగు సమాచారం లేదా ఆధారాల మేరకే జరుగుతున్నాయని ఈసీ భావిస్తోంది. నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎక్కడైనా అక్రమ డబ్బుకు సంబంధించి సమాచారం ఉంటే ఎన్నికల ప్రధాన అధికారికి సమాచారం ఇవ్వాలి అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది ఎన్నికల కమిషన్.