పైనాపిల్ లో బాంబు...గర్భిణి ఏనుగు మృతి.!

పైనాపిల్ లో బాంబు...గర్భిణి ఏనుగు మృతి.!

మానవత్వం మంట కలిసింది. ఏనుగు గర్భం తో ఉందని కూడా చూడకుండా ఆకతాయిలు చంపేశారు. ఈ అమానుష ఘటన కేరళ లో చోటు చేసుకుంది. ఆ ఏనుగు ఎవరికీ హాని చేయదు. ప్రతి రోజు ఊర్లోకి వచ్చి ఏమైనా తినడానికి పెడితే తిని వెళుతుంది. ఆ ఏనుగు ఎవరికీ హాని చేయకపోయినా ఆ ఊర్లో ఉన్న ఆకతాయి యువకులు మాత్రం దానికి హాని చేసారు. మలప్పురం జిల్లాలో రోజు వచ్చిన విధంగానే 27వ తేదీన కూడా ఏనుగు వచ్చింది.  కాగా గర్భం తో ఉన్న ఏనుగుకు ఆకతాయిలు పైనాపిల్ పండు లో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించారు. అది తిన్న ఏనుగు అరుస్తూ ఊరంతా తిరిగి వెళ్లి కాలువలో దూకింది. గాయాలు కావడంతో అది కాలువలోనే మరణించింది. ఈ విషాదకర సంఘటనను అటవీశాఖ అధికారి మోహన్ క్రిష్ణన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.