సమయానికి రాని వైద్యులు, గర్భిణీల అవస్థలు

సమయానికి రాని వైద్యులు, గర్భిణీల అవస్థలు

విశాఖ జిల్లా పాడేరు మండలం మినుములురు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు కరువయ్యారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద మెడికల్ చెకప్ కు వచ్చిన గర్భిణీ మహిళలు అవస్థలు పడుతున్నారు. వైద్యుల సరైన సమయానికి రాకపోవడంతో సుమారు ఎనబై మంది గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి నానా కష్టాలు పడిన వచ్చిన గర్భిణీలు తరలివచ్చారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో వారి కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్నారు. మరోవైపు గర్భిణీలకు కనీసం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదని వైద్య ఆరోగ్య శాఖపై మండిపడ్డారు.