సినిమాల్లోకి అడుగు పెడుతున్న వంటలక్క ..

సినిమాల్లోకి అడుగు పెడుతున్న వంటలక్క ..

దీప అంటే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు జనాలు. అంతలా  ఆ వంటలక్క ఫెమస్ అయ్యింది. కార్తీక దీపం సీరియల్ కు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు వంటలక్క ఫ్యాన్సే .. తాజాగా సమాచారం ప్రకారం ఈ వంటలక్క సినిమాల్లోకి అడుగుపెట్టనుంది.  సీరియల్‌తో ఆలిండియా లెవెల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ప్రస్తుతం ఒక సినిమలో నటిస్తున్నారని తెలుస్తుంది. కన్నడలో కారుతుముత్తు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రేమి విశ్వనాథ్.. పలు గేమ్ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు. తెలుగులో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్‌తోనే తిరుగులేని క్రేజ్ సంపాదించారు.తాజాగా ఆమె మలయాళంలో 'సాల్మన్' అనే మూవీతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇందులో భాగంగా షూట్ టైంలో నటుడు రాజివెట్టన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దాంతో ఈ ఫోటోలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. వంటలక్క సినిమాల్లోకి ఎంటర్ అవుతుండటంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.