ఢిల్లీలో బాబు దీక్షకు చకచకా ఏర్పాట్లు

ఢిల్లీలో బాబు దీక్షకు చకచకా ఏర్పాట్లు

ప్రధాని మోడీతో ఏపీ చంద్రబాబు ఢిల్లీలోనే అమీతుమీ తేల్చుకునేందుకు సర్వం సిద్ధమవుతోంది.  ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో ఫిబ్రవరి 11న బాబు చేపడుతున్న ఒకరోజు దీక్షకు దేశ రాజధానిలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. బాబు దీక్షకు జాతీయ స్థాయిలో పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీక్ష వేదిక వద్దకు ఆయా పార్టీల నేతలు విచ్చేసి బాబుకు సంఘీభావం కూడా తెలియజేయనున్నారు. దీక్షలో పాల్గొనేందుకు ఏపీ నుంచి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు.. ఏపీ నుంచి ఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మోడీ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీకి రావాలనుకునే వాళ్లు ఆ రైళ్లలో ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.