ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ 

భారత్ ను రెచ్చగొడితే పాక్ కు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నామని త్రివిధ దళాదిపతులు హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు. ఎఫ్ -16 యుద్ధవిమానాలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వాటినుంచి ఉపయోగించిన క్షిపణులను కూల్చివేశామని వారు తెలిపారు. క్షిపణుల శకలాలను మీడియా ముందు ఉంచారు. పాక్ సమాచారాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు. భారత్ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని తెలిపారు. భారత్ భూభాగంలోకి పాక్ విమానాలు ప్రవేశించాయని తెలిపారు. పాక్ కావాలనే ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసిందన్నారు.

పాక్ రెండు విమానాలను  భారత్ కూల్చింది అని పేర్కొన్నారు.  ఇప్పటికీ శాంతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమర్థవంతమైన, శక్తివంతమైన సమాధానం ఇచ్చేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు.  భారత్ రెండు విమానాలు కూల్చినా... పైలట్లు సురక్షితంగా దిగారని తెలిపారు. అడ్డుకోవటం వల్లే భారత్ ఆర్మీ స్థావరాలపై బాంబులు వేయలేక పోయారని తెలిపారు.  అనేక పాక్ యుద్ధ విమానాలు భారత్ భూబాగంలోకి వచ్చాయని తెలిపారు. బెటాలియన్ హెడ్ క్వార్టర్ ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు.  ఎఫ్ -16 యుద్ధవిమానాలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వాటిని మిగ్ తో కూల్చివేశాం అని అన్నారు.  పాక్ ఆర్మీ నిత్యం దాడికి పాల్పడుతోందని వెల్లడించారు.  మన పైలట్ అభినందన్  ప్యారచుట్ పాక్ అక్రమిత కాశ్నీర్ పడిందని తెలిపారు. ఆధీన రేఖ వెంబడి భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు.