ఎగ్జిట్ పోల్: మాయావతితో అఖిలేష్ యాదవ్ భేటీ

ఎగ్జిట్ పోల్: మాయావతితో అఖిలేష్ యాదవ్ భేటీ

ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ సమావేశాలు కొనసాగతున్నాయి. ఇదే ఒరవడిలో ఇవాళ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మహాకూటమి భాగస్వామి బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. మాయావతితో సమావేశమైన ఫోటోని ట్వీట్ చేసిన అఖిలేష్, ఇక తర్వాత అడుగుపై సన్నాహాలు చేస్తున్నామని రాశారు. అఖిలేష్ ట్వీట్ తో రాజకీయ విశ్లేషకులు అప్రమత్తమయ్యారు. అఖిలేష్, మాయావతి తమ తర్వాత కార్యాచరణలో ఏం చేయబోతున్నారని అంతా ఊహాగానాలకు పదును పెట్టారు.

ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్ వివరాలు వచ్చింది మొదలు ప్రతిపక్షాల శిబిరంలో కలకలం రేగుతోంది. ఉదయం అఖిలేష్ మాయావతిని కలుసుకోడానికి యుపి రాజధాని లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లారు. గంటకు పైగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ మాయావతితో ఉన్న ఒక ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తర్వాత కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు రాశారు.

అయితే అఖిలేష్ యాదవ్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మహాకూటమి కొనసాగనుందని చెప్పే ప్రయత్నం చేశారు. బీఎస్పీతో ఈ రాజకీయ మితృత్వాన్ని తన రాజకీయ మార్పుచేర్పుల నైపుణ్యానికి అగ్నిపరీక్షగా అఖిలేష్ భావిస్తున్నారు. ఫలితాలు దీనికి ప్రమాణం కాకపోతే అఖిలేష్ ఇంత త్వరగా చేతులెత్తేయరు. బహుశా ఆయన ఇదే సందేశంతో మాయావతి దగ్గరికెళ్లి ఉండవచ్చని అంటున్నారు. ఎగ్జిట్ పోల్ కి ముందు కూడా అఖిలేష్ యాదవ్ బీఎస్పీతో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడనున్నట్టు చెప్పారు.