మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన...ఆమోదించిన కోవింద్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన...ఆమోదించిన కోవింద్

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మరింత హాట్‌గా మారాయి.. ఓవైపు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తుండగా మరోవైపు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ పంపారు గవర్నర్. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేదమని బీజేపీ చేతులెత్తేయడంతో రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ కూడా ముగిసింది. అయితే, ఆ తర్వాత మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. ఇందుకు 24 గంటల సమయాన్ని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. అంటే ఇవాళ రాత్రి  8.30 గంటల వరకు గడువు ఉంది.

రాత్రి 8.30 వరకే గడువు ఉండడంతో.. ఆ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నదే గవర్నర్ ప్లాన్‌గా ఉంది. దీనిలో భాగంగానే ఆయన రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ పంపారు. గవర్నర్ సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రావచ్చని జాతీయ మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. రాత్రి 8.30 వరకే గడువు ఉండడంతో ఆలోపు గనుక ప్రభుత్వ ఏర్పాటు మీద స్పష్టత వస్తే రాష్ట్రపతి పాలన అమల్లోకి రావచ్చని అంటున్నారు. తాజాగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.​